కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. అలా అని అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా?

-

మన శరీరంలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. మన భూమ్మీద ఎంత శాతం నీరుంటుందో మన శరీరంలోనూ అంత శాతం నీరుంటుందని చెబుతారు. మనం ఉంటుంది భూమ్మీదే కాబట్టి అలా ఉంటుందేమో. భూమి మీద నీటి శాతం తగ్గితే నీళ్ళు దొరక్క జీవరాశులన్నీ ఎలా విలవిలలాడతాయో మన శరీరంలో నీరు తగ్గినా విలవిలలాడిపోతుంది. ఆ విషయాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే అనేక ప్రమాదాలని ఎదుర్కోవాల్సి వస్తుంది.

శరీరానికి నీరు సరిపోకపోతే ఒక్కొక్కరికీ ఒక్కోలా ఇబ్బందులు వస్తుంటాయి. చర్మ, జుట్టు మొదలగు సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటే మీ శరీరంలో నీటిశాతం తగ్గుతున్నట్తే లెక్క. తొందరగా అలసిపోవడం, మొహంలో కళ లేనట్లు మారడం మొదలగునవన్నీ నీటి శాతం తగ్గితే వచ్చే రోగాలే. కొందరిలో శరీరం ఊరికే వేడెక్కిపోవడం, వేడి పదార్థాలు పడకపోవడం వంటివి కూడా నీటి శాతం తగ్గడమే కారణం.

ఇలా శరీరం వేడెక్కిపోతుంటే కొబ్బరి నీళ్ళు తాగాలని చాలా మంది చెబుతారు. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచివనీ, శరీరంలో నీటిస్థాయిని పెంచి అనారోగ్యాల నుండి కాపాడుతుందని అంటుంటారు. అది నిజమే. అలాంటప్పుడు మంచినీళ్ళకి బదులు కొబ్బరి నీళ్ళే ఎందుకు తాగకూడదని కొంత మందికి అనుమానం రావచ్చు. ఐతే కొబ్బరి నీళ్ళనేవి మంచినీటికి ప్రయ్యామ్నాయం కాదు. అతిగా కొబ్బరి నీళ్ళు తాగితే విరేచనాల సమస్య రావచ్చు. అందుకే ఎంత మంచి కొబ్బరి నీళ్ళైనా అతిగా తాగకూడదనేది గుర్తుంచుకోవాలి.

ఏదైనా సరే అతిగా తీసుకుంటే అనర్థమే. మితంగా తింటే ఆహారం అతిగా తింటే విషం అని ఊరికే అనలేదుగా!

Read more RELATED
Recommended to you

Latest news