అల్లు అర్జున్ అంటే ఇష్టం.. ఆ పుకార్లన్నీ నిజమైతే బాగుండు..

Join Our Community
follow manalokam on social media

దబాంగ్ 3 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాయి మంజ్రేకర్, మేజర్ సినిమాతో తెలుగులోకి ఎంటర్ అవుతుంది. సర్కారు వారి పాట సినిమాకి సాయి మంజ్రేకర్ ని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ, ఎందుకో కానీ కుదర్లేదు. అప్పట్లో ఈ విషయమై చాలా వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు కూడా సాయి మంజ్రేకర్ అదే స్థాయిలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో సాయినే హీరోయిన్ గా ఎంపికైందని అంటున్నారు.

ఈ విషయమై చాలా రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకానొక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి మంజ్రేకర్ ఇలా స్పందించింది. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన డాన్సులు చాలా బాగుంటాయి. పుకార్లు వస్తున్నట్టుగా ఆయన సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే బాగానే ఉంటుందని, అలా రావాలని కోరుకుంటున్నానని తెలిపింది. సాయి నటిస్తున్న మేజర్ సినిమాలో అడవి శేష్ హీరోగా కనిపిస్తున్నాడు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...