సండే స్పెషల్ ; మటన్ ,ములక్కాయ్ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే …!

మటన్, ములక్కాయ కర్రీ కి కావలసిన పదార్థాలు: మటన్ ఒక కేజీ, మునగ కాయలు 4 కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, పసుపు ఒక స్పూన్, కారం 2 స్పూన్స్, కొబ్బరి చిన్న ముక్క, దాల్చిన చెక్క, లవంగం పొడి 1 స్పూన్, యాలకుల పొడి ½ స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, నూనె 3 స్పూన్స్, ఉప్పు తగినంత.

తయారి విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరవాత కారం, కొబ్బరి పేస్ట్ చెక్క, లవంగం, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత మటన్ ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన తరువాత ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత మునగకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి సరిపడా నీళ్ళు పోసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గరం మసాలా వేసి మరో పది నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే మటన్ ములక్కాయ్ కర్రీ రెడీ…

దీనిలో ఉన్న పోషక విలువలు: కేలరీస్ 123, కొవ్వు 5.5 గ్రా, కొలెస్ట్రాల్ 7 ఎం జి, కార్బోహైడ్రేట్స్ 11 గ్రా, ప్రోటీన్స్ 8.7 గ్రా, విటమిన్ ఏ 0.1%, ఐరన్ 9.1%, కాల్షియం 1.1%