దోస చేసే మేలు తెలుసుకుంటే పోలా..

-

కొవ్వు శాతం తక్కువగా ఉండే దోసకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అధిక శాతం పోషక విలువలు కలిగి ఉన్న దోసకాయని ఆహారంలో భాగం చేసుకుని దాన్నుండి వచ్చే ప్రయోజనాలని పొందాల్సిందే.

నిజానికి దోసకాయని కూరగాయ అనుకుంటారు. కానీ అది ఒక ఫలం. దోసకాయ కూర చేసుకుని వండుకు తింటాం కాబట్టి అది కూడా కూరగాయ అనే అనుకుంటారు.

ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు, ఎక్కువ శాతం నీళ్ళు, ఎక్కువ ఫైబర్ అన్నీ కలిపి దోసకాయని మేలు చేసే ఫలంగా మార్చివేసాయి. బరువు తగ్గడానికి దోసకాయ చాలా సాయం చేస్తుంది.

దోసకాయ వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక శాతం పోషక విలువలున్న దోసకాయలని దాని తోలు తీయకుండానే తినాలి. తోలు తీసేసి తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ శాతం తగ్గిపోతుంది. అందుకే తోలు తీయని దోసకాయలు చాలా మేలుచేస్తాయి. సాధారణంగా దోసకాయలో 96శాతం నీరు ఉంటుంది.

శరీరంలో నీటి శాతాన్ని పెంచి చల్లబరుస్తుంది. డీ హైడ్రేషన్ కి గురికాకుండా ఉండేందుకు దోసకాయలు చాలా ఉపయోగపడతాయి. నీరు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. శరీరంలో సరైన పాళ్లలో నీటిశాతం ఉంటే జీవక్రియ పనితీరు మెరుగు అవుతుంది.

బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తుంది. 300గ్రాముల దోసకాయలో కేవలం 11ఔన్సుల కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఎన్ని దోసకాయలు తిన్నా శరీరం బరువెక్కకుండా తేలికగా ఉంటుంది.

శరీరంలోని చక్కెరశాతాన్ని తగ్గిస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇక దోసకాయతో చర్మానికి చాలా ఉపయోగాలున్నాయి. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు దోసకాయ ఉపయోగపడుతుంది. చర్మంపై మచ్చలు పోవడానికి దోసకాయను తేనెతో కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల చర్మంపై మచ్చలు మాయమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news