టీడీపీలో విషాదం.. కీలక నేత మృతి !

తెలుగు దేశానికి చెందిన ఒక కీలక నేత మృతి చెందడంతో ఆ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి రాజా అలియాస్ వైటీ రాజా ఈ ఉదయం కన్నుమూశారు ఈ మధ్యనే ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాక ఆయన కోరుకున్నారు. అయితే కోలుకున్న పది రోజులకు మరలా అస్వస్థత ఏర్పడడంతో ఆయన మరలా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. రాజా 94 నుండి 2004 వరకు టిడిపి తరఫున తణుకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అయితే 2014లో ఈయనని కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరిమిల్లి రాధాకృష్ణకు టికెట్ కేటాయించారు. ఆ సమయంలో ఈయన రాధాకృష్ణ గెలుపు కోసం ఈయన పని చేశారు. ఆ తర్వాత నుంచి రాజకీయాల్లో సైలెంట్ అయిపోయిన ఈయన కరోనా సోకి కోలుకున్నాక మృతి చెందడం బాధ కలిగించే అంశం.