పోషకాల ప్యాకేజ్ మినపప్పు కిచిడి.. ఇలా చేసి చూడండి.!

-

మంచి ఆహారం అంటే..ప్లేట్ లో ప్రొటీన్, తక్కువ కార్భోహైడ్రేట్స్, మైక్రో న్యూట్రీషన్స్, విటమిన్స్ మినరల్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఒకే వంటలో ఉంటే.. సూపర్ టేస్ట్ తో హెల్తీ కదా..! మినప కిచిడీతో వీటన్నింటిని కవర్ చేసేయొచ్చు. మినప కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!

మినప కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

పొట్టుతియ్యని మినపప్పు ఒక కప్పు
బ్రౌన్ రైస్ ఒక కప్పు
కొబ్బరిపాలు ఒక కప్పు
టమోటా ముక్కలు ఒక కప్పు
పచ్చిబఠానీ అరకప్పు
పుదీనా అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు 4-5
అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
మిరియాలు ఆరు
దాల్చిన చెక్క ముక్కలు రెండు
లవంగాలు నాలుగు
పసుపు కొద్దిగా
ఇంగువపొడి కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

మీ దగ్గర మట్టిపాత్ర ఉంటే అదే వాడండి.. పొయ్యిమీద ఒక పాత్ర పెట్టి మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, అల్లం తురుము వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఇంగువపొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, మీగడ, పచ్చిబఠానీలు వేసి దోరగా వేయించుకోండి. కడిగిన బ్రౌన్ రైస్ కూడా వేయండి. నానపెట్టిన పొట్టుతియ్యని మినపప్పు కూడా వేయండి. పొట్టు తియ్యకపోతనే మంచి పోషకాలు ఉంటాయి. నాలుగు గంటల పాటు నానపెట్టి.. క్లీన్ చేసుకుని వేయండి. పసుపు, పుదీనా వేసి బాగా కలుపుకోండి. అందులోనే టమోటా ముక్కలు, కొబ్బరి పాలు ఒక కప్పు, ఒక కప్పు వాటర్ పోసి మూత పెట్టి సిమ్ లో ఉంచి ఉడకనివ్వండి. పైన నిమ్మరసం, కొత్తిమీర వేసి దింపేయడమే.. ఎంతో టేస్టీగా అంతకంటే హెల్తీగా ఉండే కిచిడీ రెడీ.! టైమ్ లేనప్పుడు సింపుల్ గా ఇది చేసుకోవచ్చు. మీరు పెసరపప్పుతో కిచిడీ చేసుకుని ఉంటారు. ఈసారి ఇలా మినపప్పుతో చేసి చూడండి.!

Read more RELATED
Recommended to you

Latest news