పచ్చిబఠానీ రైస్ తయారీ ఎలా చేయాలో తెలుసా..?

615

కావలసిన పదార్థాలు :
బియ్యం : 1 కప్పు
బౌల్ : 1
నీరు : రెండున్నర కప్పులు
నెయ్యి : 1 టేబుల్‌స్పూన్
పచ్చిబఠానీలు : అర కప్పు
బిర్యానీ ఆకు : 1
ఏలకులు : 2
జీలకర్ర : 1 టీస్పూన్
గరంమసాలా : అర టీస్పూన్
ఉప్పు : తగినంత
కొత్తిమీర : తగినంత

తయారీ :
బియ్యాన్ని అరగంటపాలు నానబెట్టాలి. నానిన బియ్యాన్ని కడిగి మైక్రోవేవ్‌లో పెట్టుకునే బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో రెండున్నర కప్పుల నీరు, నెయ్యి, పచ్చిబఠానీలు, బిర్యానీ ఆకు, ఏలకులు, జీలకర్ర, ఉప్పు, కట్ చేసిన కొత్తిమీర బాగా కలుపాలి. ఈ బౌల్‌కు మూతపెట్టి 15 నిమిషాలపాటు మైక్రోవేవ్‌లో పెట్టాలి. ఆ తర్వాత బౌల్ మూతతీసి అన్నం మొత్తం కలిసేలా కలిపి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే ఆహా అనాల్సిందే.