సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం

-

కావలసినవి :
సగ్గుబియ్యం : అర కప్పు
నీరు : రెండున్నర కప్పులు
పాలు : 2 కప్పులు
చక్కెర : అర కప్పుకి రెండు టేబుల్‌స్పూన్లు
ఏలకుల పొడి : అర టీస్పూన్‌
నెయ్యి : 3 టీస్పూన్లు
జీడిపప్పు, ఎండుద్రాక్ష : తగినన్ని

తయారీ :
ముందుగా పాన్‌లో నెయ్యి వేసి సగ్గుబియ్యాన్ని వేయించాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రక్ష వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పాలను వేడి చేసి పెట్టుకోవాలి. కడాయిలో నీరు పోసి బుడుగలు వచ్చే వరకు వేడి చేయాలి. ఆ తర్వాత వేయించిన సగ్గుబియ్యం వేసి మూతపెట్టాలి. సగ్గుబియ్యం ఉడికే సమయానికి మిశ్రమం కూడా దగ్గరపడుతుంది. ఇందులో చక్కెర కలిపి వేడిచేసిన పాలు ,ఏలకులపొడి వేసి కలుపాలి. నాలుగు నిమిషాలపాటు చిన్నమంట మీద ఉంచాలి. దించేముందు జీడిపప్పు, ఎండుద్రాక్షను జోడించాలి. తయారయిన వేడివేడి సగ్గుబియ్యం పాయసాన్ని బౌల్‌లో తీసుకొని తింటే ఆ టేస్టే వేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version