కావాల్సిన పదార్థాలు:
డార్క్ చాక్లెట్- 500గ్రాములు
డ్రైప్రూట్స్- తగినన్ని
నెయ్యి లేదా వెన్న-100గ్రాములు
ప్లాస్టిక్ చాక్‌లెట్ అచ్చులు
తయారీ విధానం:
ముందుగా పాన్‌లో నీళ్ళు పోసి స్టౌపై పెట్టాలి. గిన్నెలో డార్క్ చాక్లెట్ వేసి పాన్‌లో పెట్టాలి. కింద వేడికే చాక్లెట్ కరుగుతుంది. చాక్లెట్ కరిగే దాకా తిప్పుతూ ఉండాలి. చాక్లెట్ కరగటానికి ఓవెన్‌లోనైతే 1 నిముషం ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత దానిని దింపి స్పూన్‌తో బాగా కలపాలి.
అవసరమైతే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ మిశ్రమంలో డ్రైప్రూట్స్ పోసి కలపాలి. అందులోనే నెయ్యి లేదా వెన్న వేస్తే క్రీం బాగా మృదువుగా అవుతుంది. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని ప్టాస్టిక్ అచ్చుల్లో పోసి 3 నిముషాలు డీప్ ప్రిజ్‌లో పెట్టి తీస్తే సరిపోతుంది. అంటే ఎంతో సులువుగా డార్క్ చాక్‌లెట్ రెడీ..
డార్క్ చాక్లెట్‌లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి. వారానికి మూడు సార్లు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల గుండె జబ్బులు నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నడార్కె చాక్లెట్ వంటివి తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్స్ నుండి రక్షణ కల్పించవచ్చు. అలాగే వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు.