కరోనా నుండి రికవరీ అయ్యాక మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కూరగాయలు

-

కరోనా నుండి రికవరీ అయ్యాక కూడా దాని ప్రభావం శరీర అవయవాల మీద ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దానివల్లే అలసట, ఒత్తిడి వస్తున్నాయని అంటున్నారు. కరోనా కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, శరీరంలోని పోషకాలు కరిగిపోవడం జరుగుతుంటుంది. అందువల్ల కరోనా నుమ్డి రికవరీ అయ్యాక శరీరానికి కావాల్సిన పోషకాలని అందించాలి. అందుకోసం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు కరోనా నుండి రికవరీ అయినట్టయితే ఈ కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోండి.

పాలకూర

విటమిన్ ఎ, బి, సి, ఇ, కె, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు కలిగిన పాలకూర శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ కారణంగా కండర నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి కరోనా నుండి రికవరీ అయ్యాక పాలకూరని మీ ఆహారంలో చేర్చుకోండి.

అల్లం

అల్లంలో యాఅంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఈ కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీఆక్సెడెంట్లు కూడా ఉండడంతో శరీరంలో విషపదార్థాలు నాశనం అవుతాయి.

బ్రోకలీ

చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడే బ్రోకలీ శరీరానికి చాలా అవసరం. విటమిన్ సి, బీటా కెరోటిన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బీన్స్

ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరిచి శరీరంలో ఎక్కువ శక్తిని ప్రేరేపిస్తుంది. దానివల్ల శరీరం చురుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉంటారు.

ఇవే కాదు ఇంకా కొవ్వు స్థాయిని నియంత్రించే సోయాని కూడ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news