సోషల్ మీడియా: నూతన నిబంధనల సమ్మతి నివేదికకు చివరి తేదీ ఈరోజే.. కేంద్రం

-

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన నూతన నిబంధనలను సమ్మతిస్తూ ఈరోజే నివేదిక పంపాలని కేంద్రం, సోషల్ మీడియా సంస్థలను కోరింది. గోప్యత విషయంలో తీసుకువచ్చిన కొత్త విధానాలతో పాటు సోషల్ మీడియా సంస్థలు ఈ నియమాలని బుధవారం నుండి పాటించాల్సిందేనని తెలిపింది. దీని ప్రకారం ప్రతీ సొషల్ మీడియా సంస్థ, దానిలో నియమితమై ఉన్న చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఇంకా నోడల్ కాంటాక్ట్ పర్సన్ వివరాలు కోరింది.

భారతదేశంలో సేవలందిస్తున్న సంస్థల్లో మాతృసంస్థ అయిన లేదా దాని అనుబంధ సంస్థ అయినా, సోషల్ మీడియా అనదగ్గ ప్రతీ సంస్థ ఈ నియమాలని సమ్మతించాలని తెలిపింది. దీని ప్రకారం కొన్ని వివరాలను మంత్రిత్వ శాఖ ఇవ్వమని కోరింది. అందులో చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ నియామకాలు చేపట్టాలని, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవి వీటిని పాటించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఈ నిబంధనలు పాటించనట్లయితే సోషల్ మీడియా సభ్యత్వాన్ని కోల్పోతారు. దానివల్ల ఏదైనా ఫిర్యాదుల విషయంలో క్రిమినల్ కేసుల్లో బాధ్యత వహించాల్సి వస్తుందని సూచించింది. ఇంకా కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ వచ్చినపుడు కొత్తగా నియామకం అయిన ఆఫీసర్లకు సమాచారం అందుతుందని, అలా అందిన 36గంటల్లో ఆ సమాచారం తీసివేయాల్సి ఉంటుందని అన్నది. భారతదేశ సార్వభౌమత్వాన్ని, భద్రత లేదా దేశ సమగ్రతను దెబ్బతీసే సమాచారం విషయంలో మొదట రూపొందించినవారి సమాచారాన్ని అందించాల్సిందిగా సరికొత్త ఐటీ నియమ నిబంధనలు ఐటీ మంత్రిత్వశాఖ రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news