పరగడుపున పెరుగులో ఈ పొడి కలిపి తీసుకోండి.. హార్ట్ బ్లాకులు మొదలు ఎన్నో సమస్యలు దూరం..!

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, కీళ్లు అరిగిపోవడం, షుగర్, రక్తపోటు ఇలా చాలా సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యలు అన్నిటినీ కూడా మనం ఈ చిట్కాలు ద్వారా తొలగించుకోవచ్చు. చాలా రకాల సమస్యల్ని దూరం చేయడానికి ఈ చిట్కా ఉపయోగ పడుతుంది.

పైగా దీని కోసం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. కేవలం రెండు పదార్థాలు ఉంటే చాలు. అవే పెరుగు, అవిసె గింజలు. ఈ రెండిటితో నిజంగా రకరకాల సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అవిసె గింజలని ఒక సారి వేయించి ఆ తర్వాత వాటిని పొడి చేసుకోండి. రెండు టీ స్పూన్ల పొడిని అర కప్పు పెరుగులో కలపాలి. షుగర్ లేకపోతే బెల్లం పొడిని కానీ పటిక బెల్లం పొడిని కానీ ఇందులో వేసుకోవచ్చు.

షుగర్ ఉంటే మాత్రం వద్దు. ఊబకాయం సమస్యతో బాధపడే వాళ్ళు భోజనానికి ఐదు నిమిషాలు ముందు దీనిని తీసుకుంటే మంచిది. ఈ అవిసె గింజల పొడిని తీసుకుంటే కంటి చూపు బాగుంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎమకలు దృఢంగా మారతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు కూడా తొలగి పోతాయి.

కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు మంటలు కూడా తగ్గి పోతాయి. హృదయ ఆరోగ్యానికి కూడా ఇదే మేలు చేస్తుంది. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నరాల సమస్యలు కూడా దూరమైపోతాయి జీర్ణశక్తి కూడా మెరుగు పడుతుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు. పరగడుపున దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.