స్కిన్ కేర్: చలికాలంలో మీ చర్మాన్ని తేమగా ఉంచేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు

-

చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా చలి కారణంగా చర్మం పొడిబారిపోతుంది. ఈ సమయంలో చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు డైట్లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. ప్రస్తుతం అవేంటో తెలుసుకుందాం.

అవకాడో:

చర్మాన్ని తేమగా ఉంచే అనేక పోషకాలను అవకాడో కలిగి ఉంది. శరీరానికి మంచి చేసే కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉన్న దీన్ని డైట్లో యాడ్ చేసుకుంటే మీ చర్మం సురక్షితంగా ఉంటుంది.

బాదం:

బాదంలో విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి హాని కలిగించే పదార్థాలతో ఫైట్ చేసి చర్మానికి తేమను అందిస్తుంది. రోజూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో బాదం యాడ్ చేసుకోండి.

టమాట:

లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా కలిగిన టమాట… చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో విటమిన్-సి తో పాటు ఎక్కువ శాతం నీరు ఉంటుంది. అందుకే సలాడ్లలో టమాటాను యాడ్ చేసుకోండి.

స్వీట్ పొటాటో:

బీటా కెరటిన్ కలిగిన స్వీట్ పొటాటో శరీరానికి మంచి చేస్తుంది. బీటా కెరటిన్ ని మన బాడీ విటమిన్-ఏ గా మారుస్తుంది. విటమిన్-ఏ కారణంగా చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.

దోసకాయ:

దోసకాయలో నీటిశాతం అధికంగా ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిలో దోసకాయ ఉపయోగపడుతుంది.

అంతేకాదు, నారింజలు, ఓట్ మీల్, వాల్ నట్స్, అవిసెగింజలు, మొదలగు వాటిని డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోండి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, పొడిబారకుండా చూసుకుంటాయి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news