వీళ్ళు అస్సలు పుచ్చకాయని తీసుకోకూడదు…!

-

వేసవికాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఎండలు మండిపోతూ ఉంటాయి అలాంటి సమయంలో చల్లటివి తీసుకోవడానికి ప్రతి ఒక్కరి ఇష్టపడతారు. అయితే చాలా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది అని అలా కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే పండ్లని తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వేసవికాలంలో పుచ్చకాయని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. పుచ్చకాయ వలన చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి నీటి శాతం పుచ్చకాయలో అధికంగా ఉంటుంది అలానే ఆరోగ్యనికి కూడా పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది.

 

అయితే వీళ్ళు మాత్రం అసలు పుచ్చకాయని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుచ్చకాయ తినే ముందు తప్పక డాక్టర్ని కన్సల్ చేయాలి. పుచ్చకాయలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ b6, మెగ్నీషియం, షుగర్, డైటరీ ఫైబర్, సోడియం, పొటాషియం ఇలా. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 72 ఉంటుంది ఇందులో సుక్రోస్ ఎక్కువ ఉంటాయి పుచ్చకాయ తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అందుకని కొంతమంది అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

డయాబెటిస్ ఉన్నవాళ్లు పుచ్చకాయని ఎక్కువ తినకూడదు. ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి దీంతో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కిడ్నీ సమస్య ఉన్న వాళ్లు కూడా పుచ్చకాయని తీసుకోకూడదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు దీనికి దూరంగా ఉండటమే మంచిది. అదేవిధంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా పుచ్చకాయను తీసుకోకూడదు ఇందులో పొటాషియం హార్ట్ బీట్ పై ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి పుచ్చకాయ అసలు ఎలర్జీలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా పుచ్చకాయకి దూరంగానే ఉండాలి. బీపీ మందులు వాడే వాళ్లు కూడా పుచ్చకాయని తీసుకోకూడదు ఇలాంటి వాళ్ళు పుచ్చకాయకి దూరంగా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news