18 రోజుల్లోనే పదో ఫలితాలను విడుదల చేశాం – బొత్స

-

ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే…ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, పరీక్షలు పూర్తి అయిన 18 రోజుల్లో ఫలితాలను విజయవంతంగా విడుదల చేశామని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎలాంటి లీకేజీలు లేకుండా మొత్తం ప్రక్రియ నిర్వహించామని వెల్లడించారు.

ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనలు చెప్పారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. భావోద్వేగాలకు లోనై విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మీరు మళ్ళీ విజయం సాధిస్తారని.. ప్రతి ఓటమి గెలుపుకు బాట వేస్తుందని వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version