ప్రొటీన్‌ రిచ్‌ సోయా ఆకు ఫ్రై.. కండపుష్టికి బెస్ట్‌ ఫుడ్‌..!

-

భారతదేశంలో ఎంతో మంది ప్రొటీన్‌ లోపంతో బాధపడుతున్నారు. ప్రొటీన్‌ లోపాన్ని భర్తీ చేయాలంటే..తినే ఆహారంలోనే అందిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. సోయాలో అధిక ప్రొటీన్‌ ఉంటుంది. దీని తర్వాత పెసరపప్పు. ఈ రెండింటి కాంబినేషన్‌తో ఫ్రై చేస్తే.. రిచ్‌ ప్రొటీన్‌..బెస్ట్ టేస్ట్.. కండపుష్టికి, బలానికి తిరుగులేని ఆహారం. సోయా ఆకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!

సోయా ఆకు ఫ్రే చేయడానికి కావాల్సిన పదార్థాలు..

సోయా ఆకు ఒకటిన్నర కప్పు
నానపెట్టిన పెసరప్పు అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
పచ్చిమిర్చి నాలుగు
వేరుశనగపప్పులు ముక్కా చెక్కా రెండు టేబుల్‌ స్పూన్స్
అల్లం చిన్నముక్కలు ఒక టేబుల్‌ స్పూన్
జీలకర్ర ఒక టేబుల్‌ స్పూన్
లెమన్‌ జ్యూస్ ఒక టేబుల్‌ స్పూన్
మీగడ ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా

తయారు చేసే విధానం

నాన్‌స్టిక్‌ పాత్రలో మీగడ వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కొద్దిగా వేగనివ్వండి. అందులో నానపెట్టుకున్న పెసరప్పు వేసి మూతపెట్టి అయిదు నిమిషాలు ఉంచండి. ఇందులో కట్‌ చేసుకున్న సోయఆకును వేసి ఫ్రై చేయండి. మళ్లీ మూతపెట్టి ఆరు నిమిషాలు ఉంచితే ఆకులో ఉన్న పచ్చి అంతా పోతుంది. మూత తీసేసి నిమ్మరసం, వేపించిన వేరుశనగపప్పు ముక్కా చెక్కా కూడా వేయండి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన సోయా ఆకు ఫ్రై రెడీ. అరకేజీ అయినా తినేయొచ్చు. చపాతీల్లోకి, పుల్కాల్లోకి ఇది చాలా బాగుంటుంది. ఎదిగేపిల్లలకు, వ్యాయామాలు చేసే వారికి ఇది పెడితే మంచి కండపుష్టి, బలం వస్తుంది. ప్రొటీన్‌ లోపానికి టాబ్లెట్స్‌ వాడటం కంటే..ఆహారంతో కవర్‌ చేయడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. ఈ సారి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడూ చేసుకునే ఫ్రైల కంటే.. ఇది కాస్త డిఫ్రెంట్‌ కాబట్టి ఇంట్లో వారికి ఈజీగా నచ్చుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news