Aishwarya Rai : హైదరాబాద్​లో ఐశ్వర్యా రాయ్.. ఫొటోలు వైరల్

-

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్​లో అడుగుపెట్టింది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఈ బ్యూటీ భాగ్యనగరానికి వచ్చింది. ఈ ఈవెంట్​లో మెరున్ కలర్ ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. ఈ ఔట్​ఫిట్​లో ఐశ్వర్య చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఐశ్వర్య తాజా ఫొటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వయసు పెరిగినా ఈ భామ వన్నె తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటికీ అందగత్తె అంటే తమకు ఐశ్వర్యేనని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ అందాన్ని చూస్తూ హాయిగా చనిపోవచ్చంటూ విరహవేదనకు గురవుతున్నారు. ఐష్ వి లవ్యూ అంటూ హార్ట్ ఎమోజీస్​ను పోస్టు చేస్తున్నారు.

ఇక పీఎస్2 ప్రమోషన్స్​లో భాగంగా ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ హైదరాబాద్​ ఫ్యాన్స్​కు తన ముద్దులు అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’పై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ నెల 28న విడుదలకాబోతున్న ‘పీఎస్‌ 2’కు మీ ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నా. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన మణిరత్నంగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.’’ అని చెప్పుకొచ్చింది ఐష్.

 

Read more RELATED
Recommended to you

Latest news