RRR Team at OSCARs: రాయల్ లుక్ లో ఆస్కార్ వేడుకకు RRR టీమ్

-

ఆస్కార్ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో తెలుసు. ఈ పురస్కారమంటే భారతీయ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ప్రతి ఏటా జరిగే ఆస్కార్ వేడుకకంటే ఈ ఏడాది కాస్త ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. దానికి కారణం ఈసారి ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఉండటం.

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా తారలంతా తరలివస్తున్నారు. ఇప్పటికే లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందం.. ఆస్కార్ వేడుక జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంది. రాయల్ లుక్ లో రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. బ్లాక్ కలర్ రాయల్ అట్టైర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సందడి చేశారు. చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు.

మరోవైపు డైరెక్టర్ రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ, ఎస్ ఎస్ కార్తికేయ, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. వీరంతా ఇండియన్ ట్రెడిషనల్ రాయల్ లుక్ లో వేడుకకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news