OTT సబ్‌స్క్రిప్షన్‌ లేదా?..ఈ ఛానెళ్లలో ఆస్కార్ వేడుక చూసేయండి..!

-

మరికొద్ది నిమిషాల్లో 95వ అకాడమీ అవార్డుల వేడుక జరుగనుంది. అమెరికా.. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అవార్డుల వేడుక ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ అవార్డు జరుగుతున్న వేదిక వద్దకు తారలు తరలివస్తున్నారు.

ఈ అవార్డు వేడుకను వీక్షించాలని ప్రపంచ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వేడుకలు పలు ఓటీటీల్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఓటీటీ అందుబాటులో లేనివాళ్లు ఎలా చూడాలని ఆలోచిస్తున్నారా..?

ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేకపోయినా.. స్టార్ కనెక్షన్‌ ఉంటే చాలు.. స్టార్ మూవీస్‌, స్టార్‌ మూవీస్‌ సెలెక్ట్‌, స్టార్ వరల్డ్‌, స్టార్ వరల్డ్‌ ప్రీమియర్ హెచ్‌డీ, స్టార్ వన్‌, స్టార్ ప్లస్‌, స్టార్ గోల్డ్‌, స్టార్ ఉత్సవ్‌, ఫాక్స్‌, ఫాక్స్‌ క్రైమ్​, విజయ్‌ టీవీ ఛానెళ్లలో కూడా ఆస్కార్‌ ఈవెంట్‌ను చూడొచ్చు. ఇంకేంటి మరి ఓటీటీ లేని వాళ్లు పై ఛానెళ్లలో మీ స్టార్ నెట్‌వర్క్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఛానల్‌లో ఆస్కార్‌ ఈవెంట్‌ను వీక్షించొచ్చన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news