Sitara Ghattamaneni : ఉగాది పర్వదినాన పుత్తడిబొమ్మలా సితార.. ఫొటోలు వైరల్

-

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. అందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో తెలుగు నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా మంది సెలబ్రిటీలు సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు షేర్ చేసి.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని కూడా ఉగాది పండుగను వైభవంగా జరుపుకుంటోంది. నూతన ఏడాది సందర్భంగా సితార పట్టు లంగావోణీలో దర్శనమిచ్చింది. ఈ ట్రెడిషనల్ డ్రెస్సులో సితార కుందనపు బొమ్మలా కనిపించింది.

సితార ఘట్టమనేని ఫెస్టివ్ లుక్ ను తన తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తన ముద్దుల తనయ ఎంత అందంగా కనిపిస్తుందో అంటూ మురిసిపోయారు. అలాగే అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సితార ఉగాది వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సితార ఫొటోలు చూసిన అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news