మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔషధ మొక్కల్లో కలబంద కూడా ఒకటి. దీన్ని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కలబందకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్రస్తుతం అనేక రకాల కాస్మొటిక్స్, మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే కలబంద గుజ్జును మనం కూడా పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు వాడవచ్చు. మరి ఆ గుజ్జుతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కలబంద గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆ గుజ్జును తింటే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపునే కలబంద గుజ్జును తింటే జీర్ణాశయంలో ఉండే సూక్ష్మ క్రిములన్నీ నశిస్తాయి. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
2. కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లు త్వరగా మానాలంటే కలబంద గుజ్జును ఉపయోగించాలి. ఆ గాయాలపై కలబంద గుజ్జును రాస్తుంటే అవి త్వరగా మానుతాయి.
3. కలబంద గుజ్జుకు కొన్ని నీళ్లు కలిపి దాన్ని మౌత్‌వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో దంత సమస్యలు పోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి.
4. పాదాలు బాగా పగిలిన వారు ఆ పగుళ్లపై కలబంద గుజ్జును అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వరగా పాదాల పగుళ్లు తగ్గుతాయి.
5. మలబద్దకం సమస్య ఉన్నవారు నిత్యం రాత్రి పూట కలబంద గుజ్జును తినాలి. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలు కూడా తగ్గుతాయి.
6. మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలోనూ అలోవెరా చక్కగా పనిచేస్తుంది. కొద్దిగా గుజ్జును తీసుకుని ఆయా ప్రదేశాలపై రాస్తే ఆ సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.
7. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం కలబంద గుజ్జును తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.