ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ: సీఎం కేసీఆర్

-

ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధి రేటు సాధించింది. అతి తక్కువ కాలంలో విద్యుత్ సమస్యను అధిగమించాం. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. మంచినీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన మిషన్ భగీరథ సఫలమైంది.

తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం.. పబ్లిక్ గార్డెన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధి రేటు సాధించింది. అతి తక్కువ కాలంలో విద్యుత్ సమస్యను అధిగమించాం. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. మంచినీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన మిషన్ భగీరథ సఫలమైంది. మిషన్ కాకతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాం. పెంచిన పింఛన్లు జులై నుంచి అమలు చేస్తాం. కల్యాణ లక్ష్మీ పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేశాం.

అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకానికి విత్తనాలు ఇచ్చాం. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం సఫలమైంది. బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్, రంజాన్ లను రాష్ట్ర పండుగలుగా గుర్తించాం. ఆయా కులాల ఆత్మ గౌరవ భవనాలను హైదరాబాద్ లో నిర్మిస్తాం. ప్రజా వైద్యంపై విశ్వాసం పెరిగేలా ఆసుపత్రుల పనితీరు మెరుగుపర్చాం. త్వరలో దంత, చెవి, ముక్కు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలవబోతోంది.. అని సీఎం స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news