వంటింట్లో దొరికే జీలకర్రతో ఈ లాభాలన్నీ మీకోసమే..!

-

జీలకర్రను మనం వంటల్లో వాడుతూ ఉంటాం. ఆహారానికి సువాసనతో పాటు రుచిని తీసుకువస్తుంది. జీలకర్రలో అద్భుతమైన ఔషద గుణాలు పుస్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీలకర్ర వలన కలిగే ప్రయోజనాలను చూదాం.ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు స్పూన్ల జీలకర్ర వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని ప్రతిరోజు ఉదయం పూట త్రాగడం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జీలకర్ర మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.ఆకలిని పెంచుతుంది.కడుపులో ఏర్పడే గ్యాస్ట్రిక్,అల్సర్లను నివారిస్తుంది. జీవక్రియ ఫలితంగా ఏర్పడే వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కడుపులో ఉండే పరాన్ని జీవులను నివారిస్తుంది.జీలకర్ర రక్తంలోని చక్కెర నిల్వలను క్రమబద్ధీకరిస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి గుండెకు రక్త సరఫరా సాఫీగా అందేలా సహాయపడుతుంది.ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యలను నివారిస్తుంది.చర్మంపై ఏర్పడే ముడతలు మరియు పొడి బారే సమస్యలను తగ్గిస్తుంది.చర్మానికి కావలసిన పోషకాలను అందించి ముఖానికి నిగారింపును తెస్తుంది.

మూత్రాశయ సమస్యలను తగ్గిస్తుంది.జీరా వాటర్ ను తీసుకోవడం వల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లు సైతం కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది.ప్రేగుల్లో ఏర్పడిన వ్యర్ధాలను తొలగిస్తుంది. కడుపులో ఏర్పడే వికారం మరియు కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా అతిగా వచ్చే త్రేన్పుల సమస్యలను తగ్గిస్తుంది. ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది. మొలల వ్యాధి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

శరీరంలో ఏర్పడే అనారోగ్యాలను తొలగిస్తుంది. జలుబు, దగ్గులను తగ్గిస్తుంది. మలబద్ధకం మరియు గ్యాస్ సమస్యలను తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది. బరువు తగ్గేందుకు కూడా జీలకర్ర అమోఘంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.జీలకర్ర విత్తనాలు ఊబకాయం మరియు మధుమేహం యొక్క లక్షణాలను తగ్గించడానికి సమర్ధవంతంగా పనిచేస్తాయని నిరూపించబడింది.

Read more RELATED
Recommended to you

Latest news