ఈ ఐదు అలవాట్లు ఉన్నాయా… ఇక అంతే సంగతులు..

-

మాన‌వ ప‌రిణామ క్ర‌మంలో మంచి అల‌వాట్ల‌తో పాటు చెడు అల‌వాట్ల‌ను చేసుకుంటూ మ‌నిషి జీవిత కాలాన్ని త‌గ్గించుకుంటున్నారు. అలాంటి వాటిల్లో మ‌ద్య‌పానం, దూమ‌పానం ముఖ్య‌మైన‌వి. ఈ రెండూ కాకుండా దాదాపు ప్ర‌తీ ఒక్క‌రు చేసే చిన్న చిన్న త‌ప్పిదాలే మ‌నిషిని ప్ర‌మాదంలోకి నెడుతున్నాయి.  ధూమపానం మాత్రమే కాకుండా మనిషిని చావు అంచుల వరకు తీసుకెళ్లే భయంకరమైన అలవాట్లు మరో అయిదు ఉన్నాయి. వీటికి బానిసలైతే మనం బతకడం చాలా కష్టం అని వైద్యులు తెలుపుతున్నారు. ఆ అయిదు అలవాట్ల గురించి ఒక్కసారి పరిశీలిస్తే….

ఇలా అయిదు భయంకరమైన వ్యాధుల్లో మొదటిది ఒంటరి తనం. ఇలా ఒంటరిగా ఉన్న వారు అనేక రకాల రోగాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మనదేశంలో 22శాతం మంది పెద్ద వారు ఒంటరిగా జీవితాలను గడుపుతున్నారు. మయసు మీద పడినవారే అనుకుంటే ప్రస్తుత రోజుల్లో యువత కూడా ఒంటరితనంగా ఫీలయి అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటోంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కూడా అనారోగ్యానికి కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చక్కని ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అంశం. సరిగ్గా తినడం శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన స్థాయిలో అందించడానికి సహాయపడుతుంది.

సరైన వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. మన శరీరంలోకి చేరే క్యాలరీలు, ఖర్చయ్యే క్యాలరీల మధ్య శక్తి సమతుల్యత లోపించడం వ‌ల్ల‌ స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. రోజూ ఉద‌యం వ్యాయామం చెయ్య‌డం లేదా వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆహారం తీసుకోవ‌డంతో పాటు, క్ర‌మం త‌ప్పకుండా వ్యాయామం చెయ్య‌డంతో శారీర‌కంగా ధృఢంగా ఉండ‌వ‌చ్చు. శారీర‌కంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండడం చాలా ముఖ్యం.

నిద్ర లేమి :నిత్యం వేధించే సమస్యల్లో నిద్రలేమి ఒకటి. దీనికి ఆహారపుటలవాట్లూ, అనారోగ్య సమస్యలతో పాటూ జీవనశైలీ కారణమే.  కొంత మంది నిద్ర పోకుండా పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇటీవలి అధ్యయనం 38 సంవత్సరాల కాలంలో నిరంతర నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు ఈ సమయంలో చనిపోయే అవకాశం 97% ఎక్కువగా ఉందని కనుగొన్నారు. నిద్ర‌లేమి వ‌ల్ల‌ మెదడుపై అదనపు ఒత్తిడి పెగ‌డంతో ఆందోళన, మానసిక ఆరోగ్య రుగ్మతలకు దారి తీస్తుంది.

నిరాశావాదం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మ‌న‌పై మ‌నం పెంచుకునే ఒత్తిడి నిరాశావాదానికి దారి తీస్తుంది. ఏ ప‌ని చెయ్య‌కుండా వెన‌క‌డుగు వేస్తూ త‌మ వ‌ల్ల ఏది కాదు అనే భావ‌న పెర‌గ‌డం నిరాశావాదం యొక్క ముఖ్య ల‌క్ష‌ణం. ప్రతికూలంగా ఆలోచ‌నలు చెయ్య‌డం మరియు నిరాశావాదం దాదాపుగా ఈ మ‌ద్య కాలంలో చూస్తున్న స‌మ‌స్య‌. చిన్న చిన్న వాటికే బాద‌ప‌డిపోయి ఆత్మ హ‌త్య‌లు చేసుకుంటున్నారు. దీనికి గ‌ల ముఖ్య కార‌ణం నిరాశావాదం. దేశంలో 2017 నుండి 2019 వ‌ర‌కు 24వేల మందికి పైగా టీనేజ‌ర్లు ఆత్మ హ‌త్యులు చేసుకున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరాశా నిస్పృహ‌ల‌నుండి బ‌య‌ట ప‌డాల‌నుకోవ‌డం తొలి మెట్టు.

ప్రతికూల ఆలోచ‌న‌లు వదులుకొని రోజువారీ జీవితంలో మరింత చురుకుగా ఉండాలి. , బాగా నిద్రపోండి పోవ‌డం వ‌ల‌న మ‌న‌సు తేలిక‌గా ఉంటుంది. సమతుల్య ఆహారాన్ని తినండి మరియు సంతోషంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news