పచ్చిబాదంను అలాగే తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యల భారిన పడక తప్పదు..!

-

బాదం చెట్లను ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు. సిటీస్ లో వాళ్లు పెద్దగా పెంచరేమో కానీ..ఊర్లలో అయితే మనకు బాదం చెట్లు కూడా కనిపిస్తాయి. చిన్నప్పుడు అటుగా వెళ్తూ ఆ బాదం చెట్లకు రాళ్లేసి కాయలు కొట్టుకుని..అది చూసి ఓనర్ల చేతిలో దెబ్బలు తిన్న ఘటనలు కూడా చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అదేంటో మన ఇంట్లో ఉన్నాకానీ..స్కూల్ కు వెళ్లే దారిలో జామకాయ, మామిడికాయ, ఇలా బాదం చెట్లు ఉంటే..చేతులు అస్సలు ఊరుకోవు..  ఏదో విధంగా రాళ్లు వేసి కాయలు కొట్టుకుని తినాలనే ఆరాటం ఉండేది కదా.. అయితే మనం తెలిసీ తెలియక పచ్చిబాదంను కూడా తింటుంటాం.. కానీ అలా తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తినటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

పచ్చి బాదంపప్పును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయంతోపాటు శరీరంలోని అనేక అవయవాలకు హాని కలుగుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి. పచ్చి బాదంలో అమిగ్డాలిన్ అనే మూలకం ఉంటుంది. దీని కారణంగా రుచిలో కొంచెం చేదుగా, వగరుగా కూడా అనిపిస్తుంది.

మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు పచ్చిబాదం అస్సలు తినకూడదు. పచ్చి బాదంలో అనేక రకాల మూలకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో జరిగే రసాయన చర్యలు.. మెగ్రేన్ రోగులకు మరిన్ని ఇబ్బందులను కలిగిస్తాయి.

పచ్చి బాదంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి ఇవే కారణంగా కూడా మారుతుంది.. అందుకే పచ్చి బాదం తింటే మూత్రపిండాలను హాని కలుగుతుందంటారు.

పచ్చి బాదంపప్పులను ఎక్కువగా తినడం వల్ల పోషకాలను శరీరం గ్రహించలేదు. పచ్చి బాదంలో టానిన్‌లు ఉంటాయి. వీటి కారణంగా శరీరంలోని పోషకాలను శోషించుకోవడంలో అనేక సమస్యలు వస్తాయి.

అయితే కొందరు ఆ బాదంకాయను కాల్చుకుని తింటారు. ఇలా తినటం మంచిదే..మంచి టేస్ట్ తో పాటు ఎలాంటి ప్రమాదం ఉండదు..కానీ ఏదైనా లిమిట్ దాటనంతవరకే..మోతాదు పెరిగితే..పచ్చిదైనా, ఎండు బాదం అయినా ఆరోగ్యానికి మంచిది కాదు..! కాబట్టి మీలో ఎవరికైనా పచ్చిబాదం తినే అలవాటు ఉండే..వెంటనే అది మానుకోండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news