సామాన్యుడికి మరో షాక్ తప్పదా.. అంటే జౌననే సమామాధానమే వస్తోంది. వంట నూనెల ధరలు, ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దవాతావరణం.. ధరలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికా అంటోంది. దీంతో దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడింది. ఆయా దేశాల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులపై ప్రభావం పడే ఛాన్స్ కనిపిస్తోంది.
ఉక్రెయిన్ నుంచి భారత్ అధికంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. గతేడాది 1.89 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ దిగుమతి చేసుకుంటే.. అందులో 74 శాతం ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంటుంది భారత్. తాజాగా ఈ ప్రభావం ఇండియా దిగుమతులుపై పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.