మతిమరుపు మీకు అలవాటుగా మారిందా? విటమిన్ బీ12 లోపం కావచ్చు. చెక్ చేసుకోండిలా..

-

విటమిన్ బీ 12 అనేది శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు. దీన్ని బయట నుండి తీసుకోవాల్సిందే. మెదడు పనితీరు బాగుండడానికి, నరాల పని సక్రమంగా ఉండేందుకు విటమిన్ బీ 12 ఉపయోగపడుతుంది. ఐతే చాలామంది విటమిన్ బీ 12 లోపాన్ని కలిగి ఉంటారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది దీని బారిన పడుతున్నారు. ఇది సముద్రపు ఆహారం, మాంసం, గుడ్లు, పౌల్ట్రీలో ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా శాఖాహారుల్లో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది.7అసలు విటమిన్ బీ 12 లోపం ఉందని ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాయీ ఇక్కడ చూద్దాం.

 

నాలుక ఉపరితలం మారిపోవడం

నాలుక మీద అనేక మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పుల కారణంగా రుచిని తెలుసుకోవడం కష్టం అవుతుంది. చాలాసార్లు కారం తిన్నా కూడా కారంగా అనిపించదు. అలాగే అక్కడి నుండి నోటి పూత సమస్య ఏర్పడవచ్చు. ఇంకా అనేక నోటి సమస్యలు వస్తాయి.

మతిమరుపు

మతిమరుపు అనేది చిన్నగా మొదలై ప్రతీదీ మర్చిపోయే పరిస్థితికి వస్తుంది. మీరెక్కడైనా ఏదైనా వస్తువును పెట్టి పదే పదే మర్చిపోతున్నారంటే దానికి కారణం విటమిన్ బీ 12లోపం అయి ఉండవచ్చు. అందుకే మతిమరుపు ఎక్కువ అవుతున్నప్పుడు విటమిన్ బీ 12 సరిగ్గా తీసుకుంటున్నారో లేదో చెక్ చేసుకోండి.

నరాల్లో నొప్పిగా అనిపించడం

విటమిన్ బీ 12 లోపం వల్ల నరాల పనితీరు దెబ్బ తినే అవకాశం ఉంది. దానివల్ల నొప్పి వస్తుంటుంది. నడవలేకపోవడం ,కూర్చోలేకపోవడం మొదలైన ఇబ్బందులు వస్తాయి.

మనసు బాగలేకపోవడం

ప్రతీసారీ మనసు బాగుండకపోవడం జరుగుతుంది. చిన్న దానికే అలసిపోయినట్టుగా ఫీలవుతారు. దీనివల్ల పనిమీద శ్రద్ధ తగ్గుతుంది. ఫోకస్ తగ్గిపోతుంది. తద్వారా జీవితం మీద పెద్ద దెబ్బ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version