ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!!

-

ఇటీవల కాలంలో చాలా మంది ఆస్తమాతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. పైగా వర్షాకాలం ఎక్కడ చూసినా జబ్బులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలా చాలామంది ఆస్తమాతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాకాలం మాత్రమే  కాదు వచ్చే చలికాలంలో కూడా మరింత తీవ్రతరం అవుతుంది. ఇక ఊపిరి సరిగ్గా ఆడక,  ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దగ్గు,  ఆయాసం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి చాలా సహజంగా కనిపించే లక్షణాలు. ముఖ్యంగా ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కాబట్టి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మందులు తీసుకున్నా సరే ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది.

ఇకపోతే ఇది ప్రాణాంతకం కాకపోయినా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది . కాబట్టి తక్షణమే ఉపశమనం పొందే లాగా చూసుకోవాలి. ఇక ఆస్తమా నియంత్రణలో ఉంచడానికి పాలకూర ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆస్తమా ఉపశమనం కోసం చాలా సమర్థవంతంగా పాలకూర పనిచేస్తుంది. పాలకూరలో విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.అంతేకాదు పాలకూరలో ఉండే ఫోలేట్ ఎన్నో రకాల జబ్బులను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా లక్షణాలు తగ్గించడంలో ఫోలేట్ చాలా సహాయపడుతుంది. ఇక అంతేకాదు విటమిన్స్  కూడా సమృద్ధిగా ఉండటం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా పాలకూరను వారానికి రెండు సార్లు మీ వంటల్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇక పాలకూరలో ఉండే లక్షణాలు ఆస్తమాను తగ్గిస్తాయి కాబట్టి ఆస్తమాతో బాధపడేవారు తప్పకుండా మీ ఆహారంలో పాలకూరను చేర్చుకోవాలి. కాబట్టి ఈ సీజన్ వచ్చే సీజన్లో కూడా మీరు పాలకూరని తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక ఖర్చు లేకుండా విరివిగా లభించే పాలకూరతో ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని వైద్యుల సైతం సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news