చెడు శ్వాస మొదలు అజీర్తి సమస్యల వరకు ఈ టీ తో మాయం..!

పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మనం టీ రూపంలో తీసుకుంటే చాలా సమస్యల నుండి బయట పడవచ్చు. పుదీనాలో ఉండే మెంథాల్ మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది. జలుబు వంటి సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్ కూడా అందులో ఉంటాయి. అదే విధంగా అజీర్ణ సమస్యలను కూడా పుదీనాతో మనం చెక్ పెట్టొచ్చు. అయితే పుదీనా టీ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు…?, ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూద్దాం.

 

పుదీనా టీ కి కావలసిన పదార్థాలు:

రెండు కప్పుల నీళ్ళు
15 పుదీనా ఆకులు
రెండు టేబుల్ స్పూన్ల పంచదార లేదా తేనె
ఐస్

తయారు చేసుకునే పద్ధతి:

ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్ళు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లలో పుదీనా ఆకులు వేయాలి. ఆ తర్వాత మూడు నుండి నాలుగు నిమిషాల పాటు అలాగే వదిలేసి పుదీనా ఆకుల్ని వడకట్టి ఆ మిశ్రమంలో తేనె లేదా పంచదార వేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటిని సర్వ్ చేసుకోవాలి.

పుదీనా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

అజీర్తి సమస్య ఉండదు:

జీర్ణ సమస్యలను తొలగించడానికి పుదీనా టీ బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్, బ్లోటింగ్, స్టొమక్ అప్ సెట్ ఇలాంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. కాన్స్టిపేషన్ సమస్య కూడా దీనిని తీసుకోవడం వల్ల ఉండదు.

మంచి నిద్ర వస్తుంది:

పుదీనా టీ తాగడం వల్ల రిలాక్స్ గా ఉండొచ్చు. అలాగే బాగా నిద్ర పడుతుంది కూడా. పైగా ఇందులో కెఫీన్ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. యాంగ్జైటీ వంటి సమస్యల నుండి కూడా ఈ టీ తాగడం వల్ల బయటపడొచ్చు.

చెడు శ్వాస సమస్య ఉండదు:

పుదీనా మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. దీనితో చెడు శ్వాస సమస్య ఉండదు. నోట్లో ఉండే బ్యాక్టీరియా వంటివి కూడా తొలగిపోతాయి. ఇలా ఇన్ని ప్రయోజనాలు మనం పుదీనా టీ తో పొందొచ్చు తద్వారా ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.