కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళన లు మొదలై నేటి కి ఏడాది అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీ లో సరిహద్దుల వద్ద పెద్ద సంఖ్య రైతులు ఆందోళనలు చేశారు. ఈ ఆందోళన లో ఉత్తర ప్రదేశ్, హర్యన, పంజాబ్, ఉత్తరాఖండ వంటి రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్య లో రైతులు ఆందోళన లు చేశారు. ఈ ఏడాది ఉద్యమ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న 700 మంది రైతులు మృతి చెందారు.
ఏడాది పాటు ఆందోళన చేయగా నవంబర్ 19న దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. అయినా రైతులు తమ ఆందోళన ను విరమించలేదు. పార్లమెంటు లో సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు బిల్లు పెట్టి ఆమోదించేంత వరకు ఉద్యమం ఆపేది లేదని రైతు నాయకులు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఢిల్లీ లో సంయుక్త కిషన్ మోర్చ ఈ రోజు సమావేశం కానుంది. అలాగే దేశ వ్యాప్తం గా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళన లు చేయాలని పిలుపు నిచ్చారు.