నిద్ర గురించి మీకెవ్వరికి తెలియని భయంకర నిజాలు.. !!

-

ఈ బిజీ లైఫ్‌లో చాలామందికి కంటికి సరిపడా నిద్ర ఉండడంలేదు. ఎంతసేపు పనుల్లో మునిగిపోయి, సంపాదనే ద్యేయంగా రాత్రి పగలు కష్ట పడుతున్నారు. సంపాదించడం మంచిదే కానీ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పని చేయడం మంచిది కాదు. మీరు సరైన విశ్రాంతి, నిద్ర లేకుండా కష్టపడి పనిచేసినాగాని ఆ ఆస్తిని అనుభవించడానికి మీరు ఉండాలి కదా. ఔను మీరు విన్నది నిజమే.. మీరు కంటి నిండా సరిగ్గా కునుకు తీయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదమని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.. మీరు మీ వృత్తికి ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అంతే ప్రాధాన్యత నిద్రకు కూడా ఇవ్వాలి. కొంతమంది అయితే మరి దారుణం. రేయింబవళ్లు మొబైల్ ఫోన్లతో గడుపుతూ నిద్రకు దూరమవుతున్నారు. ఇకనైనా స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా నిద్రను ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా నిద్రలేమి వల్ల కలిగే కొన్ని షాకింగ్ సమస్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలియజేశారు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఎనిమిది గంటల సరిపడే నిద్ర కోసం కచ్చితంగా ఒక టైమ్ టేబుల్‌ ను సిద్ధం చేసుకోండి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత పడకపై వాలి ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోండి. ఇలా కనక మీరు చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కాలంలో టీనేజర్లు నిద్ర కన్నా మొబైల్ ఫోన్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయాన్నీ మరిచిపోయి, చాలామంది పబ్‌జీ ఆడుతూ.. వెబ్‌సీరిస్‌లు చూస్తూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారు భవిష్యత్తులో మధుమేహానికి గురికావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వయస్సులో సరైన నిద్రలేకపోతే శరీరం.. రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణ సామర్థ్యం కోల్పోతుందట. అంతేగాక రోగ నిరోధక సమస్యలు ఏర్పడి వివిధ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉందట.టీనేజర్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. పుస్తకాలు కంటే మొబైళ్లతోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఫలితంగా ఆ ఫోన్లో ఉండే బ్లూ వయొలెట్ కిరాణాల ప్రభావం కళ్లపై పడి నిద్రలేమి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. దీనివల్ల టీనేజర్లు తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. అందుకనే నిద్ర చాలా అవసరం.. అలా అని అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అనార్థమే.

అందుకే పెద్దవాళ్లు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు. కానీ, 6 గంటల కంటే తక్కువ నిద్ర మాత్రం మంచిది కాదు. కనీసం 7 గంటలైన కంటి నిండా నిద్రించాలి. కొందరు సుమారు 9 నుంచి 10 గంటలు సేపు నిద్రపోతారు. అలాంటి నిద్ర కేవలం టీనేజర్లకు మాత్రమే మంచిదట. కానీ, 11 నుంచి 12 గంటల సేపు నిద్ర అస్సలు మంచి కాదు. కాబట్టి.. వారికి ఫోన్లు, టీవీలు అలవాటు చేసి వారి నిద్రను చెడగొట్టవద్దు. చాలామంది రాత్రివేళ మిస్సయిన నిద్రను.. పగటి వేళ భర్తీ చేసేద్దాం అని అనుకుంటారు. కానీ, దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. శరీరం రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం వేళల్లో చురుగ్గా ఉంటుందని, కానీ.. రాత్రి వేళ విశ్రాంతి లేకుండా చేసి.. ఉదయం వేళ బలవంతంగా విశ్రాంతి ఇవ్వడం వల్ల ఫలితం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news