ప్రపంచంలో పాస్లిస్ట్ నిరోధనానికి చాలా దేశాలు ప్రత్రేక కూటమిలుగా ఏర్పాడి..ప్లాస్టిక్ రహిత ప్రపంచం చూడాలని ముందుకు వస్తున్నాయి..అయితే తాజాగా చాలా అగ్ర దేశాలు చెత్త నిర్వహణలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి..ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో విఫలం చెందాయి.పైగా మూడో ప్రపంచ దేశాలే పాస్టిక్‌ను ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయ వేదికపై విమర్శలు చేస్తాయి అగ్ర దేశాలు. ప్రపంచంలో నివాసానికి ఆమోదయోగ్యం అయిన..ఉత్తమ నివాస దేశాలుగా పేరుగాంచిన యూఎస్, యూకే చెత్త నిర్వహణలో మాత్రం వెనుకబడ్డాయని తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి..ప్రపంచంలోనే అతి ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ దేశాల నుంచే పోగుపడుతున్నాయని.. అధ్యయన ఫలితాలు ప్రముఖ సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురింది..ప్రజలందరికీ నిత్యావసరాలైన నీరు, ఆహారంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్ వచ్చి చేరింది.ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం సంక్షోభ స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తంచేశారు..కరోనా విజృంభిస్తున్న సమయంలో చాలా లాక్ డౌన్ విధించాయి.. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ రిసైకింగ్ కంపెనీలు అన్ని మూత పడ్డాయి..దీంతో యూఎస్‌లో రీసైక్లింగ్ కోసం సేకరించిన ప్లాస్టిక్‌లో సగానికి పైగా విదేశాలకు రవాణా చేయబడినట్లు 2016 నుంచి లభించిన తాజా డేటా చూపిస్తుంది.. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కష్టపడుతున్న దేశాలకు పంపించారు. అంటే ఎగుమతి ముసుగులో అమెరికా..ప్రపంచ వాతావరణానికి చేస్తున్న నష్టాన్ని కప్పి పుచ్చుకుంటోందని ఈ అధ్యయనం పేర్కొంది.