మీ కనుబొమ్మల అందాన్ని పెంచుకోవాలంటే… ఈ టిప్స్ అనుసరించాల్సిందే…!

-

కనుబొమ్మలు అందంగా ఉంటే ముఖానికి ఇంపైన ఆకృతి వస్తుంది. చాలా మంది మహిళలు కనుబొమ్మల పై కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. బ్యూటీ పార్లర్స్ కి వెళ్లి త్రెడ్డింగ్ వగైరా చేయించుకోవడం చూస్తుంటాం. అయితే మరి వీటిని మరెంత అందంగా తీర్చిదిద్దడానికి, ట్వీజర్‌తో తీర్చిదిద్దడం లో కొన్ని మెలకువలు… ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఇక ఆలస్యం ఎందుకు పూరిగా చూసేయండి.

ట్రిమ్మింగ్‌ చేసినప్పుడు మొదట అదనపు వెంట్రుకలు తొలగించిన తర్వాత భృకుటి దగ్గర సరిగ్గా లెవెల్ గా లేకుండా ఉన్నా వెంట్రుకలను బ్రష్‌ తో దువ్వి.. ఆ తరువాతనే ‌ సిజర్స్‌ తో ట్రిమ్‌ చేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేస్తే మీ కనుబొమ్మలు మరెంత అందంగా ఉంటాయి. అలానే కనుబొమ్మల వెంట్రుకలను ట్వీజర్ ‌తో తొలగించే సమయం లో రెండు అద్దాలు ఉపయోగించాలి. ఒకటి మామూలు అద్దం మరొకటి భూతద్దం. ట్వీజర్‌తో వెంట్రుకను తొలగించే సమయంలో ఒకటి వాడి, తొలగించిన తర్వాత మారే కనుబొమల ఆకారం సరిచూసుకోవడం కోసం మరొకటి అవసరం.

చాల మంది పర్ఫెక్ట్ షేప్ కోసం ప్రయత్నిస్తూ.. వెంట్రుకలను ఒకే రోజు కట్ చేస్తారు. కానీ అలా చెయ్యకూడదు. రోజుకు కొన్ని చొప్పున తొలగిస్తూ, కనుబొమలు పొందే ఆకారాన్ని గమనిస్తూ ఉండాలి. ఇలా చెయ్యడమే కరెక్ట్. సహజ సిద్ధంగా ఏర్పడిన ఆకారాన్ని అనుసరించి, అదనంగా పెరిగిన వెంట్రుకలను మాత్రమే తొలగించాలి. అలా చేస్తే మంచి నాచురల్ షేప్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news