పర్ఫెక్ట్‌ నెయిల్‌ షేప్‌ కావాలా?

-

మెరిసే మోము.. ఆకట్టుకునే నవ్వు.. అందమైన కురులు.. అద్భుతమైన శరీరాకృతి. ఇవి మాత్రమే కాదు అందానికి చిహ్నాలు. వీటిలో ఏ పనికైనా చేతులు అవసరం. అలాంటి చేతివేళ్లకు ఉండే గోర్లు ఇంకెంత అందంగా ఉండాలి. చిన్న సైజులో ఉన్నా అందం మాత్రం ఎక్కువగా ఉంటుంది. వాటిని సరైన పద్దతిలోకి మార్చుకునేందుకు కొన్ని చిట్కాలు. వాటిని పాటిస్తే చాలు అందమైన గోర్లు మీ సొంతం అవుతాయి.

 

సన్నని గోర్లు : ఈ రకం గోర్లు తేలికగా ఉంటాయి. చిన్న పనులు చేసినా విరిగిపోతూ ఉంటాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే విరిగిపోతాయి. ఇలాంటి వారు నోట్లో వేళ్లు పెట్టుకోకుండా ఉండేలా చూసుకోవాలి. నోట్లో నానడం వల్ల విరిగిపోతాయి. గోర్లు గట్టిగా అవ్వడానికి నెయిల్‌పాలిస్‌ పెట్టుకుంటూ ఉంటే గోర్లు గట్టిపడుతాయి.

గట్టిగోర్లు : వీరి చేతి గోర్లు పొడవుకు మించితే విరిగినప్పుడు నొప్పి అదికంగా ఉంటుంది. గోరు చిన్న సైజులో ఉన్నప్పుడే నైల్‌కట్టర్‌తో కట్‌ చేసుకొని అందులో ఉండే ఆప్షన్‌తో నచ్చిన రీతిలోకి రఫ్‌ చేసుకుంటే ఆకృతి వస్తుంది. వీరు ఆటలు ఆడేటప్పుడు గోర్లు కత్తిరించుకోవడం మంచిది. లేదంటే గట్టిగోర్లు ఎదుటివారి చర్మంలోకి సులువుగా చొచ్చుకొని పోతాయి.

గుండ్రని ఆకారపు గోర్లు : ఈ గోర్లకు గుండ్రటి ఆకారాన్ని ఇవ్వడం సులభం. మొదట్లో దాన్ని స్కేవర్‌ చేసి ఆపై సహజంగా చేతివేళ్లతో కర్వ్‌ ఆకారాన్ని ఇవ్వండి. గోరు పెంచడానికి కష్టపడేవారికి ఇది అద్భుతమైన రూపం. ఇది అన్ని రకాల చేతులకు సరిపోయే ఆకారం.

1900ల చివరి నుంచి 2000 ల ప్రారంభం వరకు ప్రాచుర్యం పొందింది. ఈ రకమైన గోరు ఆకారాన్ని పొందడానికి గురు పక్కల నుంచి గోరును కత్తిరించాలి. చక్కటి వేళ్లు ఉన్నవారు ఈ ఆకారంలో గోరును కత్తిరించవచ్చు. ఈ వేళ్లు కొంచెం పొడవుగా కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news