పిల్లలైనా, పెద్దలైనా ఆకలిగా ఉంటే కడుపు నింపుకోవడానికే చూస్తారు. కడుపు నిండితే ఇక చాలనుకుంటారు. అందులో శరీరానికి తగిన విటమిన్లు చేకూరాయో కూడా పట్టించుకోరు. అలా చేయడం వల్ల రక్తహీనతకు గురవుతారు. మనిషి పుష్టిగా కనిపించినా రక్తహీనతతో కళ్లు తిరగడం, త్వరగా నీరసించి పోవడంలాంటివి జరుగుతుంటాయి. నిరతరం వీటితో బాధపడకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు కొన్ని ఆహార పదార్థాలు ఎంచకుంటే సరిపోతుంది.
– ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్ వల్ల గుండె హాయిగా ఉంటుంది. అంతేకాదు ఎండుకొబ్బరి సంతానలేమిని దూరం చేస్తుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. ఇందుకు కారణం డ్రైకోకోనట్‌లోని సెలీనియమే. ఇది తినేవారికి క్యాన్సర్ బారిన పడే అవకాశం లేదు. ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే.. ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పేగుల్లో క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తున్నదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
– మహిళలు రోజూ 25 గ్రాములు ఎండుకొబ్బరి తినాలి. అలాగే పురుషులు 38 గ్రాములు తినాలి. ఇది రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ తింటూ ఉంటే అనారోగ్య సమస్యలుండవు. అల్సర్‌ను ఈ ఎండుకొబ్బరి దూరం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
– రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, స్వీట్‌పొటాటోస్, దోసకాయ వంటివి తీసుకుంటూ ఎముకలకు కావాల్సిన విటమిన్ ఎ లభిస్తుంది.
– కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ కె లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. నడక, ఎరోబిక్స్, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్ వంటివి ఎముకలన పటిష్టం చేస్తాయి.
– పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, గింజలు తీసుకుంటే ఎముకలకు కావాల్సిన శక్తి లభిస్తుంది.