చుండ్రు కారణంగా జుట్టు రాలిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

-

ఈ మధ్య కాలంలో జుట్టు రాలిపోవడం సాధారణంగా మారిపోయింది. అంతకుముందు జుట్టు రాలిపోతుంటే అదేదో ప్రపంచ సమస్యగా ఉండేది. కానీ ప్రస్తుతం జీవన విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రతీ ఒక్కరూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు జుట్టు రాలిపోవడంతో కొందరు బాధపడుతుంటే, మరికొందరు జుట్టు తెల్లబడుతుందని ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలున్నాయి. అలాంటి కారణాల్లో చుండ్రు కూడా ఒకటా అనేది చాలామంది సందేహం.

ఈరోజు ఆ సందేహానికి సమాధానాన్ని తెలుసుకుందాం.

నిపుణుల ప్రకారం జుట్టు రాలిపోవడానికి, చుండ్రుకి ఎలాంటి సంబంధం లేదు. చుండ్రు అనేది నెత్తి మీద ఉన్న చర్మం రేకులుగా పడిపోవడమే. ఐతే కొన్ని సార్లు ఇది జుట్టు రాలడానికి దారి తీస్తుంది. అలాంటి పరిస్థితులేంటో చూద్దాం.

నెత్తిమీద తీవ్రమైన చుండ్రు ఏర్పడితే అది ఎర్రగా మారి చిరాకుని కలిగిస్తుంది. దురద వల్ల పుట్టే చిరాకు కారణంగా వెంట్రుకల కుదుళ్ళు బలహీనమవుతాయి. అప్పుడు జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ.

చుండ్రు వల్ల జుట్టు రాలిపోవడానికి గల మరో కారణాల్లో చర్మ వ్యాధులైన సొరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బయోటిన్ లోపమూ ఉండవచ్చు. దీనివల్ల జుట్టు తీవ్రంగా రాలిపోతుంది. ఐతే ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. ఊడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుంది కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు.

చాలామంది చుండ్రు కారణంగా తలస్నానం చేయడానికి భయపడతారు. తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందని వారి భయం. అది కరెక్ట్ కాదు. తల శుభ్రపర్చుకోకుండా ఉంటే చుండ్రు ఏర్పడుతుంది.

అదీగాక కొంతమంది జుట్టు మృదువుగా అవడానికి కొన్ని మందులు వాడుతుంటారు. వాటి ప్రభావం కారణంగానూ జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ.

Read more RELATED
Recommended to you

Latest news