హాస్పిటల్ లో అగ్నిప్రమాదం..నలుగురి సజీవ దహనం !

మహారాష్ట్రలోని ఒక ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో 4 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. అందుతున్న వివరాల ప్రకారం థానే ముంబ్రాలోని ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నలుగురు సజీవ దహనం అయ్యారు. మంటలను అరికట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పనిలో రెండు ఫైర్ ఇంజన్లు మరియు ఒక రెస్క్యూ టీమ్ నిమగ్నం అయి ఉంది.  ఈ అగ్ని ప్రమాదం గురించి థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ రోగులను వేరే ఆసుపత్రికి తరలించేటప్పుడు మరణించారని చెప్పుకొచ్చారు. 

ఈ సంఘటన తెల్లవారుజామున 3:40 గంటలకు జరిగింది. ఇది నాన్-కోవిడ్ ఆసుపత్రి అని మంటలు సంభవించినప్పుడు కనీసం 20 మంది రోగులు హాస్పిటల్ లో ఉన్నర్నియా అంటున్నారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మీటర్ గదిలో మంటలు చెలరేగాయి ఆ మంటలు త్వరగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.  మంటలు చెలరేగిన వెంటనే, రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లు, ఐదు అంబులెన్స్‌లను సంఘటన స్థలానికి తరలించారు.