ఇలా చేస్తే ముఖం మృదువుగా కనిపిస్తుంది..!

-

ముఖం ఎప్పుడూ మృదువుగా కనిపించాలంటే ఇవి ప్రయత్నించండి. తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను లేదా రసాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోవడంతో పాటు చర్మం ఎంతో మృదువుగా కనబడుతుంది.

 

తేనెను గోరు వెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగా మంట మీద పెట్టకూడదు. వేడి చేయాలి అంటే ఎండలో కానీ వేడి నీటి పై ఒక గిన్నె పెట్టి వేడి చేయాలి.

ముఖం తాజాగా, మృదువుగా కనిపించాలంటే సిట్రస్ ఫ్రెషనర్ తో శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. సిట్రస్ ఫ్రెషనర్ వాడడం వల్ల ముఖం రోజంతా తాజాగా కనబడుతుంది ఇది మార్కెట్లో దొరుకుతుంది లేదా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో నీటిని మరిగించి అందులో నిమ్మ తొక్కలను వేసి మూత పెట్టాలి. అలా ఒక రాత్రి ఉంచిన తరువాత మరుసటి రోజు ఉదయం, నిమ్మ తొక్కలు తీసి ఆ నీటిలో నిమ్మ రసాన్ని కలిపి స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. దీనిని ముఖం మీద స్ప్రే చేసుకుని పది నిమిషాలు తర్వాత తుడిచేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా ఉంటుంది నిమ్మ తొక్క కు బదులుగా నారింజ, బత్తాయి, కమల లను కూడా వాడుకోవచ్చు. ఇలా చేస్తే ముఖం మృదువుగా మరియు తాజాగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news