సూర్యుడి ఉపరితలం కాదు సూర్యుడికి అసలు సమీపంగా కూడా ఎవరూ వెళ్లలేరు. ఎన్నో లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు సూర్యుడి దరిదాపుల్లో ఉంటాయి. అందువల్ల ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచే సూర్యున్ని చూడాలి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఫొటో వైరల్‌గా మారింది. సూర్యుడి ఉపరితలాన్ని నాసా ఫొటో తీసిందని, ఆ ఫొటో ఇదేనని చెబుతూ కొందరు ఒక ఫొటోను వైరల్ చేస్తున్నారు. అయితే ఇది నిజమేనా ? అంటే..
నాసా నిజానికి సూర్యుడి ఉపరితలానికి చెందిన ఫొటోను తీయలేదు. అది పూర్తిగా అబద్దం. అందువల్ల ఆ ఫొటో నాసా తీసింది కాదని స్పష్టమవుతుంది. అయితే అమెరికాకు చెందిన జేసన్ గుయెంజెల్ అనే వ్యక్తి తాను ఆ ఫొటోను తీశానని, బాగా ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ప్రాసెస్ చేయబడిన ఫొటో అదని, కానీ తన ఫొటోకు నాసా క్రెడిట్స్ ఇచ్చారని అతను తెలిపాడు.
అయితే ఫొటో తీసి సాఫ్ట్‌వేర్ ద్వారా ఎడిట్ చేశానని చెబుతున్నప్పటికీ అతను ఆ ఫొటోను ఎలా తీశాడు ? అన్న వివరాల్లో స్పష్టత లేదు. అందువల్ల ఆ ఫొటోను అతను ఎక్కడో సేకరించి దాన్ని పూర్తిగా ఎడిట్ చేసి ఆ ఫొటో సూర్యుడి ఉపరితలానికి చెందినదని చెబుతున్నాడని స్పష్టమవుతుంది. కనుక ఆ ఫొటో పూర్తిగా ఫేక్ అని నిర్దారించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో మీకు కూడా వస్తే నమ్మకండి.