కళ్ళు ఎంత అందంగా కనబడితే ముఖం అంత కాంతివంతంగా కనబడుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కంప్యూటర్ స్క్రీన్ ముందే పని చేయాల్సి వస్తోంది, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కళ్ళు నుండి నీరు కారటం, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ముఖానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు కానీ కళ్ల సంరక్షణకు సమయాన్ని కేటాయించారు. కళ్ళకు సంబంధించిన చిట్కాలను పాటిస్తే కలువల్లాంటి కళ్ళు మీరు సొంతం చేసుకోవచ్చు.
రోజ్ వాటర్ లో దూదిని ముంచి కళ్ళ చుట్టూ శుభ్రపరుచుకోవడం వల్ల కళ్ళ చుట్టూ ఉండే దుమ్ము పోతుంది దానితో కళ్ళు మెరుస్తూ కనబడతాయి.
కొబ్బరి నూనె తో కళ్ళచుట్టూ మర్దన చేస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు మాయమౌతాయి. ఇదే విధంగా వారంలో రెండు మూడు సార్లు చేయాలి. అంతే కాదు కళ్ళకి అలసట కూడా తగ్గుతుంది.
గుండ్రంగా కోసిన దోసకాయ ముక్కలను కళ్ళ కింద పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచితే కళ్ళకింద వచ్చే ముడతలు క్రమంగా తగ్గుతాయి.
రాత్రి పడుకునే ముందు కళ్లచుట్టూ ఆల్మండ్ బటర్ రాసుకొని మసాజ్ చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గి
కళ్ళు మరింత అందంగా కనబడతాయి.
రాత్రి కనుబొమలకు, కను రెప్పలకు ఆముదం పట్టించి ఉదయం కడిగితే కనుబొమలు, రెప్పలు ఒత్తుగా అవుతాయి.