ఎక్కువగా మొటిమలు ఉన్నాయా..? అయితే ఇలా చెక్ పెట్టేయండి..!

ఒక్కొక్కరి చర్మం తీరు ఒక్కోలా ఉంటుంది. అయితే చాలా మందికి పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మొటిమల వల్ల అందం తగ్గిపోతుంది. మీరు కూడా మొటిమలతో సతమతమవుతున్నారా..? అయితే మొటిమలు తగ్గించుకోవడానికి ఈ విధంగా ఫాలో అవ్వండి. వీటిని కనుక అనుసరించారు అంటే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ టిప్స్ గురించి చూసేద్దాం.

టీ ట్రీ ఆయిల్:

యాక్నీ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉంటాయి. మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ ని అలోవెరా జెల్ లో కలిపి ముఖానికి పట్టిస్తే పింపుల్స్ త్వరగా తగ్గిపోతాయి. రోజుకి రెండు నుండి మూడు సార్లు ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్ కూడా పింపుల్స్ త్వరగా తగ్గిస్తుంది. కలబంద మట్ట తీసుకుని దాని గుజ్జు తీసి పింపుల్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. 10 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి. ఇలా కూడా పింపుల్స్ త్వరగా తగ్గుతాయి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది. ముఖంపై మచ్చలు, పింపుల్స్ వంటి వాటి మీద అప్లై చేస్తే త్వరగా అవి తగ్గి పోతాయి. దీనికోసం మీరు కొద్దిగా తేనె తీసుకుని అందులో కొబ్బరి నూనె వేసి పింపుల్స్ పైన అప్లై చెయ్యండి ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి ఇలా పింపుల్స్ నుంచి బయటపడవచ్చు.