పగిలిన పాదాలు వికారంగా కనిపించి ఇబ్బంది పెడుతున్నాయా? ఐతే ఇది మీకోసమే..

Join Our Community
follow manalokam on social media

అరికాళ్ళు పగలడం అనేది చాలా సాధారణమైన సమస్య. పాదాలు పగిలి అందులో నుండి రక్తం వచ్చే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు పాదాల పగుళ్ళకి సరైన పరిష్కారం వెతుక్కోవాలి. లేదంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఐతే పాదాలు పగలడానికి చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఒంట్లో వేడి పెరగడం. శరీరంలో వేడి ఎక్కువైతే గనక ఆ వేడి పాదాల ద్వారా పగిలి బయటకి పోతుందని చెబుతుంటారు. వేడి శరీరం ఉన్నవాళ్ళకే ఈ పగుళ్ళు ఎక్కువగా వస్తాయి. ఈ సమస్యని దూరం చేయడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకునే ఔషధం పాదాల పగుళ్ళని దూరం చేస్తుంది.

కలబంద

ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందమైన చర్మం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. పాదాలు పగిలిన వారు కలబంద రసాన్ని పగిలిన ప్రాంతాల చోట రాత్రి పడుకునేటపుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని రోజులు చేస్తుంటే తొందరగా ఫలితం వస్తుంది.

సాక్స్

ఈ విషయం చాలా మందికి తెలియదు. రాత్రిపూట సాస్కులు వేసుకుని పడుకోవడం వల్ల నిద్ర బాగా పట్టడమే కాదు పాదాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మీరు వేసుకునే చెప్పులు కూడా సౌకర్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రాత్రిపూట పాదాలని శుభ్రంగా కడుక్కుని ఉతికిన సాక్సులని ధరించడం మంచిది.

వేసిలిన్

పెదాలు పగిలినపుడు వేసిలిన్ రాసుకోవడం మామూలే. అలాగే కాళ్ళకి వేసిలిన్ పెడుతుంటారు. ఐతే ఈ సారి పాదాలకి వేసిలిన్ పెట్టేముందు అందులో కొంత నిమ్మరసం కలిపితే ఫలితం ఇంకా బాగుంటుంది.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...