ఈ సమస్యలను తరిమి కొట్టాలంటే బెండకాయ కరెక్ట్…!

Join Our Community
follow manalokam on social media

మనం బెండకాయతో అనేక రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము. బెండకాయ లో అనేక ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా లాభాలు కలుగుతాయి. బెండకాయ లో ఖనిజాలు, విటమిన్లు మరియు సేంద్రియ పదార్థములు కారణంగా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. దీనిలో విటమిన్ ఏ, బి, సి, డి, ఈ మరియు కె కూడా ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్ మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే… బెండకాయను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే నీటిని ఇది ఇస్తుంది. అలానే మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఇది చాలా మంచిది. బెండకాయ తినడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఏదో ఒక రెసిపీని బెండకాయ తో చేసుకుని తింటూ ఉండండి. దీంతో సులువుగా బరువు తగ్గవచ్చు. బెండకాయ లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టకుండా ఉంచుతుంది. అలానే ఎముకలను స్ట్రాంగ్ గా తయారు చేయడానికి కూడా ఇది బాగా పనికొస్తుంది. కాబోయే తల్లులు దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పుట్టే పిల్లలు ఎముకలను స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి.

విటమిన్-ఏ లోపంతో బాధపడే వారు రెగ్యులర్ డైట్ లో బెండకాయ చేర్చండి. దీని వల్ల విటమిన్-ఎ అందుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేయడంలో బెండకాయ సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడమే కాక గుండె సంబంధిత వ్యాధులు దరిచేరనివ్వకుండా సహాయం చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చూశారా బెండకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో..! మరి ప్రతిరోజూ మీరు మీ డైట్ లో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండండి.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...