కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు

ఏపీ మంత్రి కొడాలి నానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ  షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కించ పరుస్తు వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేసింది ఎస్ఈసీ. సాయంత్రం 5 గంటల లోపు  వ్యక్తిగతంగా గాని ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది.

ఇక ఈ ఉదయం కొడాలి నాని మాట్లాడుతూ నిత్యవసర సరుకులు డోర్ డెలివరీ విధానాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తున్నామని అయితే, కొంతమంది రాజ్యాంగ సంస్థలు ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈ కుట్ర చేశారని అన్నారు. టీడీపీ ఓ దిక్కు మాలిన పార్టీ…నిమ్మగడ్డ కు ఈ కార్యక్రమం పై ఫిర్యాదు చేసిందన్న ఆయన ఆగిన బండి అని ఓ పత్రిక కథనాలు రాసిందని అంత చెత్త కార్యక్రమం అయితే ఎన్నికల కోడ్ పేరుతో ఆపటం ఎందుకు? అని ప్రశ్నించారు.