ఆయుర్వేద ఔషధం లో ఉపయోగించే తిప్పతీగ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కరోనా తీవ్రత మరోసారి విజృంభిస్తోంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
ఇది చాలా ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పొచ్చు. రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి Giloy kadha బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ని తొలగించడంలో కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఎసిడిటీ చర్మ సమస్యలు మరియు డయాబెటిస్ కూడా తొలగిపోతాయి. Giloy kadha ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
దీనికి కావలసిన పదార్థాలు:
రెండు కప్పులు నీళ్లు
రెండు చిన్న తిప్పతీగ కొమ్మలు
2 దాల్చిన చెక్కలు
నాలుగు నుంచి ఐదు తులసి ఆకులు
ఎనిమిది నుంచి పది పుదీనా ఆకులు
అర టీ స్పూన్ పసుపు
ఒక టేబుల్ స్పూన్ మిరియాలపొడి
ఒక చిన్న అల్లం ముక్క
2 టేబుల్ స్పూన్ తేనే
దీన్ని తయారు చేసుకునే పద్ధతి:
ముందుగా తిప్పతీగ కొమ్మలని చిన్న చిన్న ముక్కలు కింద చేసుకుని పొడి కింద మిక్సీ పట్టాలి ఇప్పుడు ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగించి దానిలో పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత పొడి చేసుకున్న తిప్పతీగని, దాల్చిన చెక్కని, అల్లాన్ని కూడా వేసుకోవాలి. దానిని అలా వదిలేసి పూర్తిగా మరిగించి తర్వాత చల్లార్చుకోవాలి.
ఇప్పుడు దీనిని వడకట్టి తాగడమే. దీనివల్ల యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి మరియు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. సమస్యని పూర్తిగా తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.