ఇంటి ప‌నికి ఆయుష్షుకు ఇంత లింక్ ఉందా…!

-

స‌హ‌జంగా కొన్ని చోట్ల ఆడ‌వారిని ఇంటి ప‌నుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేలా చేస్తున్నారు మ‌గ మ‌హారాజులు. నిజానికి ఇంటిలో పని అన్నింటి కన్నా కాస్త‌ కష్టమే. రోజంతా చేస్తున్నా పూర్తి అవ్వదు. అయితే మ‌గ‌వారు మాత్రం ఇంటి ప‌నులు చేయ‌డానికి నిరాక‌రిస్తారు. చ‌క్కగా ఇంటి ద‌గ్గ‌ర ఖాళీగా ఉన్న‌ప్పుడు టీవీ చూడ‌డ‌మో, ఫోన్‌తో ఆడుకోవ‌డ‌మో ఇలా అనేక కార‌ణాల‌తో మ‌గ‌వారు టైం పాస్ చేస్తారే త‌ప్పా ఇంటి ప‌నుల జోలికి మాత్రం రారు. ఇలాంటి వారంద‌రికి ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

image source & credits : www.tiq.com.sg

వాస్త‌వానికి ఇంటి ప‌నులు చేయ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అరగంట పాటు ఇంటి పనులు చేయడం ద్వారా మృత్యువు మీ సమీపంలోకి రాకుండా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని అంటున్నారు. ఇంట్లో పనులు చేయకుండా కుర్చీ లేదా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కాలక్షేపం చేసే వారి ఆయుష్షు తొందరగా పోతుందని ప‌రిశోధ‌కులు తేల్చారు.

ఇంటి ప‌నులు చేయ‌ని మ‌గ‌వారు 10 ఏళ్ల ముందే చనిపోతార‌ట‌. నిజానికి ఇంటి ప‌నుల వ‌ల్ల గుండె జబ్బులను కూడా 20 శాతం దూరం చేస్తుంది. బట్టలు ఉతకడం, ఇల్లు కడగడం, గార్డెనింగ్ చేయడం వంటి చిన్నచిన్న పనుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే మ‌గ‌వారు అర‌గంట సేపు ఇంటి పనులు చేయడం వల్ల డెత్ రిస్క్‌ను 28 శాతం దూరంగా ఉంచుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news