ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ చాలా మంది ధూమపానం అలవాటును మానలేరు. నిజానికి స్మోకింగ్ వల్ల శరీరంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం వుంటుంది. అలానే లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది.
స్మోకింగ్ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి అని అందరికీ తెలిసినప్పటికీ దాని నుండి బయటపడలేక పోతుంటారు. మీకు కూడా స్మోకింగ్ అలవాటు అయ్యి పోయిందా..? దాని నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? అయినప్పటికీ కుదరడం లేదా అయితే మీకోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యారంటే కచ్చితంగా స్మోకింగ్ అలవాటు నుండి బయట పడవచ్చు. అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దాని గురించి చూసేద్దాం.
తులసితో స్మోకింగ్ కి చెక్ పెట్టండి:
స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు తులసిని ఉపయోగించడం వల్ల స్మోకింగ్ మానేయొచ్చు. దీనికోసం మీరు ప్రతిరోజు ఉదయం రెండు నుండి మూడు తులసి ఆకుల్ని తినండి. రోజు ఉదయాన్నే ఇలా చేయడం వల్ల స్మోకింగ్ నుండి బయట పడవచ్చు.
రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగండి:
రాగి పాత్రలో నీటిని పోసి ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి అలానే స్మోకింగ్ అలవాటు నుండి కూడా ఇది బయట పడేస్తుంది. కాబట్టి ఈ చిట్కాని కూడా మీరు ప్రయత్నం చేసి చూడండి.
త్రిఫల తో స్మోకింగ్ మానేయొచ్చు:
త్రిఫల కూడా స్మోకింగ్ అలవాటు నుండి బయట పడేస్తుంది. రోజు త్రిఫలను తీసుకోవడం వల్ల కూడా స్మోకింగ్ నుండి బయట పడడానికి అవుతుంది.
వాము తో స్మోకింగ్ కి దూరంగా ఉండొచ్చు:
మీరు ఒక టీ స్పూన్ వాము తీసుకోవడం వల్ల స్మోకింగ్ కి దూరంగా ఉండడానికి అవుతుంది. నీళ్లలో తేనె, నిమ్మరసం వేసుకుని ఉదయాన్నే తాగడం వల్ల కూడా స్మోకింగ్ నుండి బయటపడడానికి అవుతుంది.