మనసు మార్చుకున్న జగన్‌…కొత్త కేబినేట్‌ లో 11 మంది పాతవారే !

-

అమరావతి : ఏపీ కేబినేట్‌ సభ్యులు నిన్న రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. కేబినేట్‌ లో ఉన్న మొత్తం 24 మంది రాజీనామా చేశారు. ఇక ఈ నెల 11 వ తేదీన కొత్త కేబినేట్‌ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలోనే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. కొత్త మంత్రి వర్గ కూర్పు పై కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు.. మంత్రి వర్గంలో పాతవారు కొనసాగే వారి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

గత మంత్రి వర్గంలో పని చేసిన 7 నుండి 11 మంది వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొత్తగా క్యాబినెట్ లోకి 14 నుండి 17 మందికి ఛాన్స్ ఉంది. సీనియారిటీ కి చోటు కల్పించాలని ఆలోచన లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం అందుతోంది.

నిన్నటి కొడాలి నాని వ్యాఖ్యల వెనుక అర్ధం అదేననిపిస్తుంది. సామాజిక సమతూకం, జిల్లా అవసరాల దృష్ట్యా మంత్రి పదవులు దక్కనున్నాయి. ముఖ్యంగా… అనుభవం కోటాలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news