క్యారట్ కంటికి చాలా ఉపయోగం…!

-

నేడు మనం తినే ఆహారంలో మార్పులు, చేర్పులు వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్లు, పోషకాలు అందడం లేదు. దాని ఫలితం గా చిన్న వయసు లోనే కంటి చూపు మందగించి, కళ్లజోళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అందుకే మన ఆహారంలో విటమిన్లు,ప్రోటీన్లు ఎక్కువ ఉన్న పదార్థాలు అధికంగా ఉండే లా చూసుకోవాలి.

క్యారట్ విటమిన్ -A తో పాటు ప్రోటీన్లు, లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం.క్యారట్ లో కెరోటిన్ విటమిన్ – A గా మారుతుంది. విటమిన్ – A లోపిస్తే రేచీకటి,చూపు మందగించటం,కంటికి సంబంధించిన వ్యాధులు,వ్యాధి నిరధకశక్తి తగ్గడం,దగ్గు,గొంతు నొప్పి వంటివి సంభవిస్తాయి. ప్రకృతి సిద్ధమైన క్యారట్ ను ప్రతి రోజూ తినడం వల్ల విటమిన్ -A లభించింది శరీరం ఆరోగ్యం గా వుంటుంది.

క్యారట్ తినడం వల్ల రక్త హీనత,గుండెకు సంబంధించిన వ్యాధులు,లివర్,కిడ్నీ కి సంబందించిన వ్యాధులు తో బాధపడేవారు క్యారట్ ప్రతి రోజూ తినడం వల్ల ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.ఇంకా కొన్ని రకాల చర్మ రోగాలు,కాళ్ళు, చేతులు మంటలకు క్యారట్ మంచి మందు గా పని చేస్తుంది క్యారట్ అనేది దుంప అనుకుంటాము కానీ నిజానికి ఇది వేరు. ప్రత్యేక విధులు నిర్వర్తించడం కోసం ఇది క్యారట్ లాగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news