ఆ ప్రభుత్వాన్ని కూల్చాలి అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని భావించి కూడా వెనక్కు తగ్గింది. రెండు పార్టీలు ఊహించని విధంగా షాక్ ఇచ్చి ప్రత్యర్ధికి మద్దతు ఇచ్చాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం బిజెపికి పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురించి ఈ చర్చ అంతా… మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒక్కో ఎమ్మెల్యేకు 45 కోట్ల ఆఫర్ ఇవ్వడానికి బిజెపి సిద్దమైంది అని ఆయన ఆరోపణలు చేసారు. సాధారణంగా కమల్ నాథ్ గురించి రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఆయనను ఎదుర్కోవడం అంత సులువు కాదు అని.
కాంగ్రెస్ విపక్షంలో ఉన్నా సరే గతంలో ఆయన తన వ్యూహాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేని పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఊహించని విధంగా వ్యూహాలు సిద్దం చేసారు. సిక్కుల ఊచకోత కాంగ్రెస్ చేసింది అనే ఆరోపణలు వచ్చినా సరే కమల్ నాథ్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గకుండా సమర్ధవంతంగా వ్యూహాలు సిద్దం చేసి కాంగ్రెస్ వైపు సిక్కులను తిప్పారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం అవుతుందా…?
ఆయన ఢిల్లీ వెళ్లి దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చండి అని బిజెపికి సవాల్ చేసారు. అయినా సరే బిజెపి మాత్రం ఎక్కడా కూడా ఒక్క ఎమ్మెల్యేని కూడా తమ వైపుకి తిప్పుకోలేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చడం అనేది సాధ్యం కాదని అంటున్నారు. అయితే బిజెపి మాత్రం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి అవసరమైతే కేంద్ర మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.